ఆషాఢ మాసంలో భార్య,భర్తలిద్దరూ ఎందుకు దూరంగా ఉండాలో తెలుసా?

by Jakkula Samataha |
ఆషాఢ మాసంలో భార్య,భర్తలిద్దరూ ఎందుకు దూరంగా ఉండాలో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : జూలై 5వ తేదీ నుంచి ఆషాఢం ప్రారంభమైంది. దీంతో ఈ మాసంలో కొత్తగా పెళ్లైన దంపతులను దూరం దూరంగా ఉంచుతారు. కాగా, అసలు ఆషాఢంలో కొత్త దంపతులు ఎందుకు దూరం ఉండాలి అంటారు? దానికి గల కారణాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆషాఢమాసంలో కొత్తగా పెళ్లైన వారు తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి. ముఖ్యంగా ఈ మాసంలో అస్సలే భార్యభర్తలు కలుసుకోకూడదు అంటారు. ఎందుకంటే ఆషాఢంలో నెలతప్పితే ప్రసవం అనేది మండే ఎండాకాలంలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీని వలన తల్లి, బిడ్డ ఇద్దరూ చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంట. అంతే కాకుండా వేసవిలో అధికరక్తస్రావం జరిగే అవకాశం ఉండటం వలన ఈ మాసంలో అస్సలే భార్యభర్తలు దగ్గరగా ఉండకూడదు అంటారు పూర్వికులు.అంతే కాకుండా కొత్తగా పెళ్లైన ఆడపిల్ల తమ పుట్టింటి దూరంగా ఉండాల్సి వస్తుంది. దీంతో ఆమె మానసికంగా చాలా ఇబ్బంది పడుతుంది. అందువలన నెల రోజుల పాటు తన తల్లిగారి ఇంటి వద్ద ఉంటే కాస్త ప్రశాంతంగా, అత్తవారిట్లో ఎలా మెలుదులుకోవాలో తెలుసుకుంటుందని, ఆషాఢమాసంలో కొత్తగా పెళ్లై ఆడపిల్లలను పుట్టింట్లో ఉంచుతారంట. నోట్ : ఇది ఇంటర్నెట్‌లో ఇచ్చిన సమాచారం మేరకు మాత్రమే ఇవ్వబడినది, దిశ దీనిని ధృవీకరించలేదు.

Advertisement

Next Story

Most Viewed