ప్రజలకు నాయకుడిగా కాదు సేవకుడిగా ఉంటాం : ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

by Aamani |
ప్రజలకు నాయకుడిగా కాదు సేవకుడిగా ఉంటాం :  ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
X

దిశ, రుద్రంగి : రూ. కోటి నలభై మూడు లక్షల తో రుద్రంగి మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్,కలెక్టర్ సందీప్ కుమార్ ఝా భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,తను జిల్లాకు కలెక్టర్ గా వచ్చిన తర్వాత చేస్తున్న మొదటి మంచి కార్యక్రమం ఆసుపత్రి నిర్మాణం అని అన్నారు. ఆసుపత్రి నిర్మాణానికి కోటి నలభై మూడు లక్షల రూపాయలు మంజూరు అయినట్లు తెలిపారు. త్వరగా టెండర్ పూర్తి చేసి నిర్మాణ పనులు కొనసాగించాలని అధికారులకు సూచించారు.

అనంతరం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం అనేది రుద్రంగి ప్రజల చిరకాల కోరిక అని అన్నారు. తనను ఎమ్మెల్యే గా గెలిపించిన రోజే ఆసుపత్రి నిర్మాణం చేపడుతా అని ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు భూమి పూజ చేయడం జరిగిందని అన్నారు. ఇందిరాచౌక్ నుండి హనుమాన్ టెంపుల్ మీదుగా అంబెడ్కర్ చౌక్ వరకు రింగ్ రోడ్డు నిర్మాణనికి నిధులు వచ్చాయని అన్నారు.అలాగే సెంట్రల్ లైటింగ్ పనులకు కూడా నిధులు వచ్చాయని అన్నారు.అలాగే మిగిలిన అభివృద్ధి పనుల గురించి కలెక్టర్ కు వివరించారు.ప్రజలు నమ్మకంతో నన్ను ఎమ్మెల్యే గా గెలిపించారు అదే నమ్మకంతో నాయకుడిగా కాదు సేవకుడిగా ఉంటూ నియోజకవర్గన్నీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో,వైద్యాధికారులు,రెవెన్యూ అధికారులు,మండల పరిషత్ అధికారులు, నాయకులు గ్రామ ప్రజలు మహిళలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed