ఏపీలో కొనసాగుతున్న వీసీ రాజీనామా..పదవుల నుంచి వైదొలిగిన ఏయూ వీసీ, రిజిస్ట్రార్

by Mamatha |
ఏపీలో కొనసాగుతున్న వీసీ రాజీనామా..పదవుల నుంచి వైదొలిగిన ఏయూ వీసీ, రిజిస్ట్రార్
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం:రాష్ట్రంలో అత్యంత వివాదాస్పద వైస్ ఛాన్స్లర్‌గా పేరుపడ్డ ఆంధ్ర విశ్వవిద్యాలయం వీసి పీవీజీడీ ప్రసాద్ రెడ్డి, నిబంధనలకు విరుద్ధంగా ఆయన నియమించిన రిజిస్టర్ జేమ్స్ స్టీఫెన్‌లు శుక్రవారం రాజీనామా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చినప్పటికీ లెక్కచేయని వీరిద్దరూ గవర్నర్ పేషీ నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో పదవుల నుంచి వైదొలగక తప్పలేదు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కూడా వైసీపీ కార్యకర్తల మాదిరిగానే పనిచేస్తున్నారు అంటూ విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి.

వీసీ తన చాంబర్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో స్థానంలో తాజా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టేందుకు అంగీకరించకపోవడం వివాదాస్పదంగా మారింది. వీసి ప్రసాద్ రెడ్డి ఏయూని వైసీపీ కార్యాలయంగా మార్చారని, ఇక్కడి నుంచి వైసీపీకి అనుకూలంగా సర్వేలు విజయసాయిరెడ్డి చెప్పిన పనులు పెద్ద ఎత్తున జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో మొత్తం మీద వీసీ రిజిస్టర్ తప్పుకోవడంతో ఏయూలో విద్యార్థులు ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు.

Next Story

Most Viewed