BREAKING: రంగారెడ్డి జిల్లాలో భారీ పేలుడు.. అక్కడికక్కడే ఆరుగురు దుర్మరణం

by Shiva Kumar |
BREAKING: రంగారెడ్డి జిల్లాలో భారీ పేలుడు.. అక్కడికక్కడే ఆరుగురు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పట్టణ శివారులోని సౌత్ గ్లాస్ కంపెనీలో గ్యాస్ ఫర్నేస్ పేలింది. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు అక్కడే ఉండటంతో భారీగా ప్రాణనష్టం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. మరో 20 మందికి పైగా తీవ్ర గాయాలైనట్లుగా సమాచారం. మృతుల్లో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి సౌత్ గ్లాస్ కంపెనీలో పని చేస్తున్నారు. పేలుడు సంభవించిన సమయంలో 150 మంది విధుల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికుల సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed