హనీమూన్ కాదు.. బడ్డీమూన్.. ఈ లేటెస్ట్ వెడ్డింగ్ క్రేజ్ గురించి విన్నారా?

by Javid Pasha |
హనీమూన్ కాదు.. బడ్డీమూన్.. ఈ లేటెస్ట్ వెడ్డింగ్ క్రేజ్ గురించి విన్నారా?
X

దిశ, ఫీచర్స్ : కొత్తగా పెళ్లైన జంటలు సరదాగా గడిపేందుకు విహార యాత్రకు వెళ్తుంటారు. దీనినే హనీమూన్ అని పిలుస్తారు. కపుల్స్ మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగేందుకు ఇది దోహదం చేస్తుంది. భారత దేశంతోపాటు చాలా దేశాల్లో ఈ సంప్రదాయం కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం కొందరు హనీమూన్‌కి బదులు బడ్డీమూన్‌ను కూడా ఫాలో అవుతున్నారు. విదేశాల్లో అయితే ఈ లేటెస్ట్ వెడ్డింగ్ క్రేజ్ ట్రెండింగ్‌లో ఉంది.

బడ్డీమూన్ అంటే..?

సాధారణంగా పెళ్లైన తర్వాత నూతన వధూ వరులు తమ హనీమూన్ ట్రిప్‌కు బయలు దేరుతారు. ఇక్కడ కేవలం కపుల్ మాత్రమే వెళ్తారు. కానీ బడ్డీమూన్‌లో అందుకు భిన్నంగా జరుగుతుంది. కొత్త జంట తమతోపాటు తమ స్నేహితులను, ఇంట్రెస్ట్ ఉన్న బంధువులను, కొలీగ్స్‌‌ను, ఫ్యామిలీ మెంబర్స్‌ను ఇలా తమ తమ ఆసక్తినిబట్టి ఇతరులను తమతోపాటు ఆహ్వానిస్తారు. అలాగని బడ్డీమూన్ కచ్చితంగా జరుపుకోవాల్సిన వేడుక కాదు. ఆయా జంటల ఆసక్తిని బట్టి బడ్డీమూన్ లేదా హనీమూన్ ఏదైనా ఎంపిక చేసుకోవచ్చు.

హనీమూన్‌కు మించి..

హనీమూన్ ట్రిప్‌ కోసం కొన్ని రోజులు లేదా వారాలు మాత్రమే ఎక్కువగా ఎంచుకుంటారు. బడ్డీమూన్‌కు ఇలాంటి లెక్కలేం లేవు. ఆసక్తి, ఆర్థిక స్థోమత, ఆనందంగా గడపాలన్న ఉద్దేశం వంటివి కీలకపాత్ర పోషిస్తాయి. అందుకే ఇప్పుడిది హనీమూన్‌కు మించి.. నెక్ట్స్ బిగ్గెస్ట్ ట్రెండ్‌గా, లేటెస్ట్ వెడ్డింగ్ క్రేజ్‌గా పాపులర్ అవుతోంది. ఓవైపు సంప్రదాయ హనీమూన్‌ ఉన్నప్పటికీ, దానిని వ్యతిరేకించకుండానే జంటలు తమ ఆసక్తిని బట్టి బడ్డీమూన్‌ను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ భార్యా భర్తలు కేవలం వన్‌సైడ్‌గా కాకుండా ఇరువైపుల ఆసక్తులను పరిగణించాలి.

విహారం.. విశ్రాంతి

బడ్డీమూన్ ట్రెండ్ అందరికీ నచ్చాలని ఏమీ లేదు. అది వ్యక్తిగత ఆసక్తులను బట్టి ఉంటుంది. ప్రస్తుతం చాలా మంది ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ జంట మాత్రమే కాకుండా తమ సహచరులుతోపాటు విహార యాత్రకు వెళ్తారు. రాత్రిళ్లు బసచేసేటప్పుడు ఆయా హోటళ్లు, ప్రదేశాలలో ఎవరికివారు వేర్వేరుగా విశ్రాంతి తీసుకుంటారు. ఉదయం లేవగానే ఆయా ప్రాంతాలకు, చూడదగ్గ ఇతర ప్రదేశాలను అందరూ కలిసి వెళ్తారు. పైగా జంటలతోపాటు వారితో వెళ్లిన వారు కూడా రిలాక్స్ అవడానికి, కొత్త ప్రాంతాలను అనుభూతి చెందడానికి ఇదో మంచి సమయం.

డెస్టినేషన్ ఈవెంట్‌గా..

బడ్డీమూన్‌ను వాస్తవానికి ఒక డెస్టినేషన్ ఈవెంట్‌గా చూడవచ్చు అంటున్నారు దాని ఫాలోవర్లు. ఎందుకంటే జంటలు తమకు తెలిసిన వ్యక్తులతో సరదాగా గడపడానికి ఇదో మంచి మార్గం. పర్యటనల సందర్భంగా ఫ్రెండ్ సర్కిల్‌తో పాటు కలిసి ఆయా ప్రాంతాలను చుట్టి రావడం ఆనందాన్ని ఇస్తుంది. అయితే బడ్డీమూన్ ఎలా కొనసాగాలనేది మాత్రం భార్యా భర్తలు ముందుగానే ప్లాన్‌ చేసుకోవాలి. ఖర్చులు, ఇరువైపులా స్నేహితులను, బంధువులను ఆహ్వానించే విషయంలో భేదాభిప్రాయాలు ఉండకుండా చూసుకోవాలి. హనీమూన్‌లో అయితే సాధారణంగా జంటను సుదూర గమ్య స్థానాలకు పంపుతుంటారు. కానీ బడ్డీమూన్‌లో అలాంటివేమీ లేవు. సరదాగా గడపడానికి, సంతోషాన్ని కలిగించే దగ్గరి ప్రాంతాలైనా ప్రొసీడైపోవచ్చు. అందమైన నగరాలు, పర్వతాలు, సుముద్ర తీరాలు, ప్రకృతి దృశ్యాలు, బీచ్‌లు, జలపాతాలు ఇలా ఆసక్తి ఉన్న ప్రాంతాలను కలిసి తిరుగుతూ ఎంజాయ్ చేయవచ్చు.

Next Story

Most Viewed