- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మున్సిపల్ కాంప్లెక్స్ లో ఫుడ్ హబ్ ఏర్పాటు చేయాలి : కలెక్టర్ జితేష్ వి.పాటిల్
దిశ, కొత్తగూడెం : కొత్తగూడెం భజన మందిర్ సమీపంలోని మున్సిపల్ కాంప్లెక్స్ లో ఫుడ్ హబ్ ను ప్రారంభించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శనివారం ఆయన మున్సిపల్ కాంప్లెక్స్ ను సందర్శించారు. కాంప్లెక్స్ లోని ప్రతి షాప్ ను వెదురు కలప ని ఉపయోగించి సుందరీకరించాలని, షాపుల పేరు ఆధారంగా డిజైన్ చేయాలని అధికారులను ఆదేశించారు. డిసెంబర్ మొదటి వారంలో మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లో ఫుడ్ హబ్ ను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ప్రతి షాప్ లో రుచికరమైన, శ్రేష్టమైన తినుబండారాలను పెట్టి అమ్ముకునే విధంగా దుకాణదారులు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.వెంటనే సమావేశం నిర్వహించి ఫుడ్ హబ్ ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి కలవారిని ఎంపిక చేయాలని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్,మున్సిపల్ కమిషనర్ శేషాంజనేయ స్వామి, డి ఈ రవికుమార్, కౌన్సిలర్ రుక్మందర్ బండారి పాల్గొన్నారు.