- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే ప్రమాదకరమా..?
దిశ, ఫీచర్స్: చాలామంది ఆఫీసులో లేదా రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటారు. తరచుగా ఇలా కూర్చోవడం వల్ల వారికి ఒక రకంగా అలవాటు అయిపోతుంది. అయితే, ఇలా ఒకవైపు కాలు వేసుకుని కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు. గంటల తరబడి ఒక కాలిపై మరొక కాలు వేసుకుని కూర్చోవడం వల్ల రక్తపోటు పెరగడం, రక్తనాళాలు ఉబ్బడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
జర్నల్ ఆఫ్ హైపర్‌టెన్షన్‌లో ప్రచురితమైన అధ్యయనాలు కాలుపై కాలు వేసుకుని కూర్చోవడం వల్ల రక్తపోటులో కొంత ప్రభావం చూపుతుందని.. ఇది తాత్కాలికంగానే ఏర్పడుతుందని తెలిపారు. కాలు మీద కాలు వేసుకుని అడ్డంగా కూర్చోవడం వల్ల నరాల వాపు వస్తుందనేది ఏమాత్రం నిజం కాదని నిపుణులు తెలియజేశారు. ఇలా కూర్చోవడం వల్ల పెరోనియల్ నరాలపై ఒత్తిడి పడి కాలు స్పర్శ కోల్పోతుంది. దీనినే తిమ్మిరి అని అంటారు. కాసేపు మాములు స్థితిలో కూర్చోవడం వల్ల ఇది సెట్ అవుతుంది. సాధారణంగా పెరోనియల్ నరాలు కాలు కింది భాగంలోని పాదాన్ని చల్లగా ఉంచుతాయి. చాలా సమయం వరకు అలాగే కూర్చోవడం వల్ల పెరోనియల్ నరాలు పక్షవాతానికి గురై ‘ఫుట్ డ్రాప్’ అనే వ్యాధి వస్తుంది. అందుకే ఎక్కువ సమయం అలాగే కదలకుండా కూర్చుని ఉండకూడదు.
కొన్ని సందర్భాల్లో కదలకుండా అలాగే కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నట్లైతే కీళ్లు లేదా మోకాలి సమస్యలకు కారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. కాళ్లకు సంబంధించిన ఏదైన సమస్యతో బాధపడుతున్న వారు గంటపాటు అలాగే ఒకే సీటులో కూర్చోకుండా మధ్య మధ్యలో లేచి నడవాలి. లేదంటే ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.