- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Rajendra Prasad: ‘అవకాశాల్లేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’.. టాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటుడు సంచలన కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్(Rajendra Prasad) తాజాగా తన కెరీర్‌లో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ పాడ్‌కాస్ట్(YouTube Channel Podcast)లో ఈ నటుడు మాట్లాడుతూ.. తన ఫాదర్ ఓ స్కూల్‌లో టీచింగ్ చెప్పేవారని.. చాలా స్ట్రిక్ట్ అని తెలిపారు. నాకు సినిమాల్లో నటించాలని ఆసక్తి ఉండేది.. కానీ నాన్నకు నా నిర్ణయం అస్సలు నచ్చేది కాదని అన్నారు. నీ ఇష్టమున్నట్లు చేసుకుంటున్నావని అసహనం వ్యక్తం చేశారని.. సక్సెస్, ఫెయిల్యూర్ ఏదొచ్చినా ఇక అది నీకు సంబంధించిన విషయమని.. ఒకవేళ సినిమాల్లో రాణించకపోతే ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నట్లైతే తిరిగి ఇంటికి రావద్దొన్నారని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.
దీంతో నాన్న మాటలు నాపై ఎంతో ప్రభావం చూపించాయని అన్నారు. అప్పట్లో మద్రాస్(Madras) వెళ్లి ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్(Film Institute)లో జాయిన్ అయ్యానని.. గోల్డ్ మెడల్(Gold Medal) కూడా సాధించానని పేర్కొన్నారు. కానీ సినిమాల్లో చాన్స్‌లు రాలేదని, ఇక చేసేదేమీ లేక ఇంటికి వెళ్లడంతో నాన్న ఎందుకు వచ్చావని కోపడ్డారని చెప్పుకొచ్చారు. నాన్న అలా మాట్లాడటంతో మనసుకు బాధగా అనిపించి.. వెంటనే ఇంటి దగ్గర నుంచి బయల్దేరి మద్రాస్ వెళ్లి.. ఆత్మహత్య(suicide) చేసుకుందామని అనుకున్నానని తెలిపారు.
ఇక చివరగా నా ఆత్మీయులందర్ని ఒక చూడాలనిపించిందని.. ప్రొడ్యూసర్ పుండరీకాక్షయ్య(Producer Pundarikakshaya) ఆఫీసుకు వెళ్లానని అన్నారు. ఆఫీసు దగ్గర మేలుకొలుపు చిత్రం గురించి ఏదో గొడవ అవుతుందని, అప్పుడు పుండరీకాక్షయ్య నన్ను చూశారని అన్నారు. ఏమీ చెప్పకుండా డబ్బింగ్ థియేటర్(Dubbing theatre) దగ్గరకు తీసుకెళ్లి.. ఒక సన్నివేశాన్ని డబ్బింగ్ చెప్పించారని తెలిపారు. నేను చెప్పింది ఆయనకు నచ్చడంతో నాపై ప్రశంసలు కురిపించారని.. తర్వాత రెండో సన్నివేశానికి కూడా డబ్బింగ్ చెప్పమన్నారని అన్నారు. ఇలా నా డబ్బింగ్ ప్రయాణం ప్రారంభమైందని.. తర్వాత అనేక సినిమాల్లో అవకాశం వచ్చిదని ఎమోషనల్ కామెంట్స్ చేశారు రాజేంద్ర ప్రసాద్.