- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దిల్ రాజు పై ఫైర్ అయిన ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ప్రోడ్యూసర్, ఎఫ్‌డీసీ ఛైర్మన్(FDC Chairman) దిల్ రాజు(Dill Raju) వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ(BRS MLC) దేశపతి శ్రీనివాస్(Deshapati Srinivas) ఫైర్ (Fire) అయ్యారు. కాగా ఇటీవల నిజామాబాద్ పట్టణంలో “సంక్రాంతికి వస్తున్నాం”(Sankrantiki Vasthunnam) సినిమా(cinima) ఫ్రీ రిలీజ్ ఈవెంట్ (Free release event) ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. నిజామాబాద్ (Nizamabad)లో పెట్టిన ఈవెంట్ ను రియాక్షన్ తక్కువ ఉందని.. ఆంధ్ర లో పెట్టి ఉంటే ప్రతి సినిమాకు ఓ వైబ్(vibe) ఇస్తారని.. తెలంగాణలో అయితే.. తెల్ల కల్లు మటన్ కు వైబ్ ఇస్తారని దిల్ రాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఆ వ్యాఖ్యలపై స్పందించిన ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్.. తెలంగాణలో వైబ్ లేకుంటే సినిమాలు మానుకొ, వైబ్ కావాలంటే కల్లు కాంపౌండ్, మాంసం దుకాణం పెట్టుకోవాలని సూచించారు. అలాగే దిల్ రాజుకు తెలంగాణతో ఏ సందర్భంలో సంబంధం లేదని, అలాంటి వ్యక్తి కూడా తెలంగాణ ప్రజల పై సెటైర్లు వేస్తూ.. తెలంగాణ కల్చర్‌ను అవమానకరంగా సెటైర్లు వేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో వైబ్ లేకుంటే.. సీఎం రేవంత్ రెడ్డి వెంటపడి.. టికెట్ రేట్ల పెంపుకు ఎందుకు ఆర్డర్లు తెచ్చుకున్నావని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్రశ్నించారు.