సందిగ్ధంలో కుబీర్ మార్కెట్ చైర్మన్ ఎంపిక..!

by Aamani |
సందిగ్ధంలో కుబీర్ మార్కెట్  చైర్మన్ ఎంపిక..!
X

దిశ,కుబీర్ : కుబీర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎంపిక సందిగ్ధంలో కొనసాగుతూ వస్తోంది. చైర్మన్ పదవి దళితులకు కేటాయించడంవల్లే కాలయాపన చేస్తూ వస్తున్నారన్న అపవాదు చోటు చేసుకుంది.ప్రభుత్వ ఏర్పడిన తర్వాత ఇప్పటికే జిల్లాలోని నిర్మల్, సారంగాపూర్, భైంసా, మార్కెట్ కమిటీలకు చైర్మన్ లను ఎంపిక చేసి పాలకవర్గాలు సైతం కొలువు తీరాయి.గత ప్రభుత్వ హయాంలోనూ మార్కెట్ కమిటీకి పాలకవర్గం ఎంపిక చేయలేదు. ఎస్సీలకు రిజర్వుడ్ కావడం వల్లే కాలయాపన చేస్తూ కాలం సాగు దిస్తూ వస్తున్నారని దళిత సంఘాలు విమర్శిస్తున్నాయి. మరోప్రక్క మాదిగ, మాల, సంఘాల నాయకులు తమకంటే తమకు కేటాయించాలని డిమాండ్ వ్యక్తం అవుతుంది.

ఇది ఇలా ఉంటే కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు నారాయణ రావు పటేల్, విట్టల్ రెడ్డి తమ అనుచర వర్గానికి దక్కేటట్లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు అన్న చందంగా మారింది పరిస్థితి. రాజ్యాధికారం అవకాశం వచ్చిన దక్కకుండా పోతున్నదని దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అగ్రవర్ణాల వారికి కేటాయించి ఉంటే కాలయాపన జరిగి ఉండేదా.. అని ప్రశ్నిస్తున్నారు. కుబీర్ మార్కెట్ కమిటీకి చైర్మెన్ను పాలకవర్గాన్ని త్వరలో ఎంపిక చేయాలని మండల వాసులు కోరుతున్నారు.

Advertisement

Next Story