Vemulawada: కేటీఆర్ నీ బాషను మార్చుకో.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హెచ్చరిక

by Ramesh Goud |
Vemulawada: కేటీఆర్ నీ బాషను మార్చుకో.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హెచ్చరిక
X

దిశ, వెబ్ డెస్క్: కేటీఆర్(KTRBRS) తన భాషను మార్చుకోవాలని, లేదంటే మేము కూడా వాడు వీడు అనాల్సి వస్తుందని ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్(AAdi Srinivas) అన్నారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. వారి హయాంలో పేదల భూములను లాక్కొని పెద్దలు పంచి పెట్టారని ఆరోపించారు. మీ కార్యకర్తలను కాపాడుకోవడానికి ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. మీ వల్ల జరిగిన పొరపాటును సరిదిద్దుతున్నామని, దళిత గిరిజనులకు చెందాల్సిన భూములు ఉన్నత వర్గాలకు చెందితే దానిని సరిదిద్దడం తప్పా అని నిలదీశారు.

అలాగే మొన్న కలెక్టర్(Collector) పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఐఏఎస్‌ల సంఘం(IAS Assosiationa) స్పందిస్తే వాటికి కేటీఆర్ ఇప్పటివరకు సమాధానం చెప్పలేదని, ఆయన భాష వల్ల సిరిసిల్ల(Siricilla) ప్రాంతం పరువు పోకుండా కాపాడాల్సిన బాధ్యత ఉందని దుయ్యబట్టారు. వాడు వీడు అంటే తాము కూడా వాడు వీడు అనాల్సి వస్తుందని, రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తాత వరకు ఎందుకు కేటీఆర్ మొన్నటి ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి మీ అయ్యను కుర్చీలో నుంచి దింపి ఫామ్ హౌస్(Form House) కి పరిమితం చేయడాన్ని మరిచిపోయావా అని ఎద్దేవా చేశారు. ఇక ప్రజాస్వామ్య పంతాలో విమర్శిస్తే స్వాగతిస్తాం.. స్వీకరిస్తామని, భూతులు మాట్లాడితే తాము మాట్లాడతామని అన్నారు. అసెంబ్లీ సమావేశాలలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ ను వచ్చి సూచనలు సలహాలు ఇవ్వమంటే ఎందుకు రావడం లేదని ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed