- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇద్దరు యువకుల మృతిపై ఆవేదనకు లోనయ్యాను: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
దిశ, వెబ్ డెస్క్: రాజమండ్రిలో శనివారం రాత్రి జరిగిన గేమ్ చేంజర్(Game changer) ఫ్రీ రిలీజ్ ఇవేంట్‌కు వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు చనిపోయారు. కాగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం(AP Deputy CM) పవన్ కల్యాణ్(Pawan Kalyan) స్పందించారు. ఈ సందర్భంగా తన ట్విట్టర్ ఖాతాలో.. "ఏడీబీ రోడ్డుపై ప్రమాదంలో యువకుల మృతి బాధాకరం" అని రాసుకొచ్చారు. అలాగే కాకినాడ – రాజమహేంద్రవరం నగరాల మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు ఛిద్రమై పోయింది. గత ఐదేళ్ళలో ఈ రోడ్డు గురించి పట్టించుకోలేదు. పాడైపోయిన ఈ రోడ్డును బాగు చేస్తున్నారు.
ఈ దశలో ఏడీబీ రోడ్డుపై చోటు చేసుకున్న ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారని తెలిసి ఆవేదనకు లోనయ్యాను. కాకినాడ జిల్లా గైగోలుపాడు కు చెందిన ఆరవ మణికంఠ, తోకాడ చరణ్ ఈ ప్రమాదం ప్రాణాలు కోల్పోయారు. మృతులు మణికంఠ, చరణ్ కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. జనసేన పార్టీ(Janasena party) తరఫున మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం(Financial assistance of Rs.5 lakh) అందిస్తాము. ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందించే ఏర్పాట్లు చేయాలని నా కార్యాలయ అధికారులకు స్పష్టం చేశాను. ఇక నుంచి పిఠాపురం నియోజకవర్గ పర్యటనలకు ఏడీబీ రోడ్డు మీదుగానే రాకపోకలు సాగించాలని నిర్ణయించుకున్నాను" అని పవన్ కల్యాణ్ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.
Read More...
తెలంగాణలో టికెట్ల రేట్లు పెంచమని అడుగుతాను : దిల్‌రాజు