Kishan Reddy: రైల్వే శాఖలో సంస్కరణలు తీసుకొచ్చాం.. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2025-01-06 07:05:56.0  )
Kishan Reddy: రైల్వే శాఖలో సంస్కరణలు తీసుకొచ్చాం.. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: పదేళ్ల పాలనలో తాము భారత రైల్వే శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. ఇవాళ చర్లపల్లి రైల్వే టెర్మినల్ (Charlapally Railway Terminal) ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.413 కోట్లతో ఎయిర్‌పోర్టు (Airport)ను తలపించేలా చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను నిర్మించామని పేర్కొన్నారు. ముఖ్యంగా తెలంగాణ (Telangana)లో 100 శాతం లైన్లను ఎలక్ట్రిఫికేషన్ చేశామని అన్నారు. హైదరాబాద్ (Hyderabad) నుంచి దేశంలోని అన్ని ముఖ్య పట్టణాలకు కనెక్టివిటీని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం (Central Government) ఎంతగానో సహకరిస్తోందని తెలిపారు. పెద్దపల్లి (Peddapally) మినహా రాష్ట్రంలోని 32 జిల్లలకు జాతీయ రహదారులను అనుసంధానం చేశామని గుర్తు చేశారు. ఎంఎంటీఎస్‌ (MMTS)కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.వెయ్యి కోట్ల ఇంకా రావాల్సింది ఉందని.. వారు ఇవ్వకపోయినా తెలంగాణ తిరుపతి యాదగిరి గుట్ట (Yadagiri Gutta) వరకు ఎంఎంటీఎస్‌ (MMTS)ను పొడిగించామని అన్నారు. అదేవిధంగా కొమురవెల్లి (Komuravelli)లో కూడా రైల్వే స్టేషన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని కిషన్ రెడ్డి తెలిపారు.

Read More: Hyd: అందుబాటులోకి చర్లపల్లి రైల్వే టెర్మినల్‌.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోడీ

Advertisement

Next Story