నిండు ప్రాణాన్ని బలితీసుకున్న ఇంటి ఖాళీ స్థలం

by Sumithra |
నిండు ప్రాణాన్ని బలితీసుకున్న ఇంటి ఖాళీ స్థలం
X

దిశ, కొడకండ్ల : మండలంలో పాత కక్షలను మనసులో పెట్టుకుని ఓ వ్యక్తి మరో వ్యక్తిని దారుణంగా హత్యచేసిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే గుగులోతు శ్రీను (49) మండలంలోని రేగుల తండా గ్రామంలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలోనే పొరుగింటి వారైన గుగులోత్ జైత్రంతో ఇంటి ఖాళీ స్థలం విషయంలో కక్షలు ఏర్పడ్డాయి. ఈ కక్షలే ఆదివారం రాత్రి గుగులోతు శ్రీను హత్యకు దారితీసింది. శ్రీనును విచక్షణా రహితంగా కత్తితో పొడిచి హత్య చేయడంతో గ్రామంలో ఒక్కసారిగా భయానక, విషాద ఛాయలు అలుముకున్నాయి. జైత్రం మద్యం మత్తులో ఉన్నాడని, క్షణికావేశంలో హత్య జరిగిందని గ్రామస్తులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed