- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Journalist murder case: ఛత్తీస్ గఢ్ జర్నలిస్టు హత్య కేసులో కీలక నిందితుడు అరెస్టు
దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఛత్తీస్గఢ్ జర్నలిస్ట్ ముఖేష్ చంద్రాకర్ (Chhattisgarh journalist murder case) హత్య కేసులో ప్రధాన నిందితుడు సురేష్ చంద్రాకర్(Suresh Chandrakar ను బీజాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం తెల్లవారుజామున అతడిని హైదరాబాద్లో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. జర్నలిస్టుకు దూరపు బంధువు, కాంట్రాక్టర్ అయిన సురేష్ చంద్రకర్ ను ఈ హత్యకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నారు. హత్య విషయం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి అతడు కనిపించకుండా పోయాడు. సురేష్ చంద్రకర్ హైదరాబాద్ లోని తన డ్రైవర్ ఇంట్లో తలదాచుకున్నాడని పోలీసులు తెలిపారు. అతడిని ట్రాక్ చేసేందుకు పోలీసులు 200 సీసీటీవీల నుంచి ఫుటేజీని పరిశీలించి దాదాపు 300 మొబైల్ నంబర్లను గుర్తించామన్నారు. ప్రస్తుతం అతడిని ప్రశ్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అంతకుముందు, సురేష్ చంద్రకర్‌కు సంబంధించిన నాలుగు బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు. అంతేకాకుండా, ఆయన అక్రమంగా నిర్మించిన యార్డును కూల్చివేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో సురేష్ చంద్రకర్ భార్యను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. జర్నలిస్ట్ హత్య కేసుతో సంబంధం ఉన్న సురేష్ చంద్రాకర్ సోదరుడు రితేష్ చంద్రాకర్, సూపర్వైజర్ మహేంద్ర రామ్తేకే, దినేష్ చంద్రకర్లను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.
జర్నలిస్ట్ హత్య కేసు..
ముఖేష్ చంద్రాకర్(journalist Mukesh Chandrakar) ఒక ప్రముఖ వార్తాసంస్థతో పాటు ఇతర న్యూస్ ఛానెళ్లలో స్థానిక రిపోర్టర్గా పనిచేసేవారు. 'బస్తర్ జంక్షన్' అనే యూట్యూబ్ ఛానల్ని కూడా నడిపేవారు. 2021 ఏప్రిల్లో కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ మన్హాస్ని మావోయిస్టుల చెర నుంచి విడుదల చేయడంలో ముఖేష్ చంద్రాకర్ కీలక పాత్ర పోషించారు. కాగా జనవరి 1న అదృశ్యమైన ముఖేష్ చంద్రాకర్ (33) మృతదేహం జనవరి 3న చటాన్ పారా ప్రాంతంలోని కాంట్రాక్టర్ సురేష్ చంద్రాకర్ ఇంటి ఆవరణలో కొత్తగా సీల్ చేసిన సెప్టిక్ ట్యాంకులో లభ్యమైంది. మృతుడి తల, వీపు, పొట్ట, ఛాతీపై బలమైన గాయాలున్నాయని పోలీసులు తెలిపారు. ఈ కేసు విచారణ కోసం బీజాపూర్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో పోలీసులు శనివారం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ(Chhattisgarh Deputy Chief Minister Vijay Sharma) ముఖేష్ చంద్రకర్ కూడా జర్నలిస్టు హత్యపై స్పందించారు. " ఈ హత్య భయంకరమైనది, బాధాకరమైనది" అని అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.