NDA: ప్రధాని మోడీ ట్వీట్ కు సీఎం చంద్రబాబు ఆసక్తికర రిప్లై

by Ramesh Goud |
NDA: ప్రధాని మోడీ ట్వీట్ కు సీఎం చంద్రబాబు ఆసక్తికర రిప్లై
X

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) పెట్టిన ట్వీట్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) రిప్లై(Reply) ఇచ్చారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ, ఒడిశా పర్యటనలపై మోడీ స్పందిస్తూ.. రేపు,ఎల్లుండి రెండురోజులు ఆంధ్ర‌ప్రదేశ్(Andhra Pradesh), ఒడిశా(Odisha)లలో ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటానని, విశాఖపట్నం(Vizag)లో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలతో పాటు భువనేశ్వర్(Bhuvaneshwar) లో జరిగే ప్రవాసి భారతీయ దివస్(Pravasa Bharathi Divas) వేడుకలలో పాల్గొంటానని మోడీ ట్వీట్టర్ లో పేర్కొన్నారు. దీనికి సీఎం చంద్రబాబు స్పందిస్తూ.. రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రాష్ట్ర ప్రజల తరపున స్వాగతం పలుకుతున్నానని అన్నారు. అలాగే రూ.2 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగే రేపటి కార్యక్రమం రాష్ట్రాభివృద్దిలో కీలక ముందడుగు అని సంతోషం వ్యక్తం చేశారు. ఇక మీకు స్వయంగా స్వాగతం పలికేందుకు విశాఖ ప్రజలతో సహా తామంతా ఎదురుచూస్తున్నామని చంద్రబాబు తెలియజేశారు.

Advertisement

Next Story

Most Viewed