అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి...!

by Sumithra |
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి...!
X

దిశ, నారాయణపేట క్రైమ్ : గొర్ల కాపరిగా ఉంటున్న ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు నారాయణపేట పోలీసులకు సమాచారం అందింది. పేరపళ్ళ గ్రామానికి చెందిన గజ్జలి ఆంజనేయులు (16) చదువు మానేసి ఏడాది క్రితం నుంచి తన యజమానికి సంబంధించిన గొర్రెలు మేపుకుంటూ ఉండేవాడు. ఈ క్రమంలో నారాయణపేట మండలం పేరపల్ల శివారులో మామిడి చెట్టుకు టెంకాయ నార తాడుతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

డాగ్ స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుకొని యువకుడి చెప్పుల వాసన చూసి ఘటనా స్థలంలో పొలం గట్ల పై కలియ తిరిగింది. రెండు మూడు చోట్ల ఉరేసుకునేందుకు మొదట ప్రయత్నించినట్లు చివరకు మామిడి చెట్టు వద్ద ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా యువకుడి కుటుంబ సభ్యులు తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునే అంత పిరికివాడు కాదని ఆరోపించారు. పోలీసులు ఈ ఘటన పై విచారణ జరుగుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story