టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో సంచలనం.. నిందితులకు బిగ్ షాక్

by srinivas |   ( Updated:2025-01-06 07:00:19.0  )
టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో సంచలనం.. నిందితులకు బిగ్ షాక్
X

దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ కార్యాలయం(Gannavaram Tdp Office)పై దాడి కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. నిందితులకు రాష్ట్ర హైకోర్టు(High Court)లో ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం17 ముందస్తు బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేసింది. ఇక కేసులో 89 మందిని నిందితులుగా పోలీసులు చేర్చారు ఏ-71గా వల్లభనేని వంశీ(Vallabhaneani Vamsi)తో పాటు ఆయన ప్రధాన అనుచరులను నమోదు చేశారు. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మిగిలిన నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్లను డిస్మిస్ చేయడంతో నిందితులకు బిగ్ షాక్ తగిలింది. ఈ పరిణామంతో నిందితులను త్వరలో పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది.

కాగా గత ప్రభుత్వ హయాంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది. ఈ దాడిలో అప్పటి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు పాల్గొన్నారు. టీడీపీ కార్యాలయం, అక్కడ నిలిపి ఉన్న కార్లు, కొందరు సిబ్బందిపైనా దాడి చేశారు. దీంతో అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఈ కేసు వేగం పుంజుకుంది.

Advertisement

Next Story