KTR : సుప్రీంకోర్టు ఆదేశాలే బలమా?..అందుకే విచారణకు కేటీఆర్ గైర్హాజర్ !!

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2025-01-06 07:12:26.0  )
KTR : సుప్రీంకోర్టు ఆదేశాలే బలమా?..అందుకే విచారణకు కేటీఆర్ గైర్హాజర్ !!
X

దిశ, వెబ్ డెస్క్ : ఫార్ములా ఈ రేసు కేసు(Formula E Race Case)లో విచారణ కోసం ఏసీబీ(ACB Investigation) కార్యాలయానికి వచ్చి విచారణకు హాజరుకాకుండా(Without Attending)నే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR)తిరిగి వెళ్లిన ఘటన చర్చనీయాంశంగా మారింది. కేటీఆర్ వెంట విచారణకు న్యాయవాదుల బృందాన్ని ఏసీబీ పోలీసులు అనుమతించకపోవడంతో కేటీఆర్ తాను విచారణకు హాజరుకానంటూ తిరిగి వెళ్లిపోయారు. ఏసీబీ విచారణ నోటీసులను లెక్క చేయకుండా కేటీఆర్ విచారణకు హాజరుకాకపోవడం వెనుక గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల(Supreme Court's Ordes) బలమే కారణమని తెలుస్తోంది.

ఏదైనా కేసు విచారణ సమయంలో.. నిందితుల స్టేట్‌మెంట్ రికార్డ్ చేసేటప్పుడు, వారి తరఫున లాయర్ కూడా ఉండాల్సిందేనని గతంలో సుప్రీంకోర్టు తీర్పునివ్వడాన్ని కేటీఆర్ న్యాయవాదుల బృందం ప్రస్తావిస్తోంది. తెలంగాణ ఏసీబీ అధికారులు మాత్రం విచారణలో కేటీఆర్‌తో లాయర్‌ను అనుమతించకపోవడంతో వారు సుప్రీంకోర్టు తీర్పును ముందుకు తెస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా ఏసీబీ అధికారులు వ్యవహరిస్తున్నారంటే.. దీని వెనుక కుట్ర కోణం ఉందంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.

కాగా కేటీఆర్ తమపై చేసిన ఆరోపణలపై స్పందించిన ఏసీబీ కేటీఆర్ క్వాష్ పిటిషన్ తీర్పు కోర్టులో రిజర్వ్ లో ఉన్నప్పటికి..తీర్పు ఇచ్చేంత వరకు విచారణ చేసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసిందని గుర్తు చేస్తున్నారు. కేటీఆర్ ఆరోపణలపై కోర్టులో మోమో వేస్తామన్నారు. కేటీఆర్ వెంట న్యాయవాదుల అనుమతిపై కోర్టు ఆదేశాలు లేవని స్పష్టం చేశారు.

Advertisement

Next Story