- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తెలంగాణలో టికెట్ల రేట్లు పెంచమని అడుగుతాను : దిల్‌రాజు
దిశ, వెబ్ డెస్క్ : గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ ( Ram Charan ) హీరోగా తెరకెక్కిన సినిమా "గేమ్ ఛేంజర్" ( Game Changer). సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ (S. Shankar )డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం గేమ్ ఛేంజర్. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు ( Dil Raju ) ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ మూవీ ఆడియెన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలోనే మూవీ టీమ్ ప్రమోషన్స్ లో బిజీ అయింది. ఏపీ లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏపీలో ఈ మూవీ టికెట్ల రేటు పెంచుకునేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతినిచ్చింది.
అయితే.. తెలంగాణలో ఇటీవల జరిగిన కొన్ని ఘటనలను దృష్టిలో పెట్టుకుని ఇకపై రిలీజ్ అయ్యే సినిమాలన్నింటికీ బెనిఫిట్ షోలు , టికెట్ల రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వబోమని సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ క్రమంలోనే తెలంగాణలో టికెట్ల రేటు పెంపునకు సంబంధించి నిర్మాత్ దిల్ రాజు షాకింగ్ కామెంట్స్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో టికెట్ల రేట్లు పెంచమని సీఎం ని అడుతానని దిల్ రాజు తెలిపారు. దీని కోసం సీఎం అపాయింట్ మెంట్ కోరామని, టికెట్ల రేట్ల పెంపు పై ముఖ్యమంత్రి పాజిటివ్ గా స్పందిస్తారని తాను అనుకుంటున్నానని చెప్పారు. ఓ నిర్మాతగా నా ప్రయత్నం నేను చేస్తానని అన్నారు. ఇప్పుడు, ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
Read More...
గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు వెళ్లి తిరిగి వస్తూ ఇద్దరు మృతి.. 5 లక్షలు సాయం ప్రకటించిన దిల్ రాజు