- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మౌలిక సదుపాయాల కల్పన కోసం చర్యలు : నిజామాబాద్ కలెక్టర్
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : మాక్లూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం క్షేత్రస్థాయిలో సందర్శించారు. కళాశాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. కళాశాల ప్రిన్సిపాల్ ను, నర్సింగ్ విద్యార్థినులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రవేశాలు పూర్తి స్థాయిలో జరిగాయా? బోధన తరగతులు సక్రమంగా కొనసాగుతున్నాయా? అని ఆరా తీశారు.
నర్సింగ్ కాలేజ్, స్కూల్ చుట్టూ ప్రహరీ గోడ, ప్రధాన రహదారి నుండి కాలేజీ వరకు రోడ్డు నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కంపోనెంట్ నిధులతో రోడ్డు నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపాలని సంబంధిత అధికారులకు సూచించారు. మంజూరీ లభించిన పనులను తక్షణమే ప్రారంభించాలని, వివిధ దశలలో పెండింగ్లో ఉన్న ఇతర పనులను కూడా యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ శాంతి సుభాష్ తదితరులు ఉన్నారు.