- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
TGPSC: టీజీపీఎస్సీ కొత్త చైర్మన్‌గా బుర్రా వెంకటేశం..ఆమోదించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
దిశ, తెలంగాణ బ్యూరో / డైనమిక్ బ్యూరో: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) చైర్మన్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇవాళ ఆమోద ముద్ర వేశారు. ప్రస్తుత చైర్మన్ ఎం.మహేందర్‌రెడ్డి పదవీ కాలం డిసెంబర్ 3తో పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో కొత్త చైర్మన్ నియామకం కోసం ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నెల 20 వరకు దరఖాస్తులు స్వీకరించగా.. సుమారు 45 అప్లికేషన్లు వచ్చినట్లుగా తెలిసింది. రిటైర్డ్ ఐఏఎస్‌లు, వివిధ వర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు సైతం ఈ పోస్టు కోసం దరఖాస్తులు చేసుకున్నారు. అందులో బుర్రా వెంకటేశ్ పేరును ప్రభుత్వం సిఫార్సు చేస్తూ ఆమోదం కోసం ఫైల్‌ను రాజ్‌భవన్‌కు పంపించింది. తాజాగా ఆ ఫైల్‌కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోద ముద్ర వేశారు. డిసెంబర్ 3న టీజీపీఎస్సీ చైర్మన్‌గా బుర్రా వెంకటేశం బాధ్యతలు స్వీకరించబోతున్నట్లు తెలుస్తున్నది. 1995 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కొనసాగుతున్నారు. ఐఏఎస్‌గా బుర్రా వెంకటేశంకు ఇంకా నాలుగేళ్ల సర్వీస్ ఉంది. 2030 వరకు ఆరేళ్ల పాటు ఆయన పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా కొనసాగనున్నారు.
పేద కుటుంబం నుంచి ఐఏఎస్
బుర్రా వెంకటేశం 1968 ఏప్రిల్ 10న ప్రస్తుత జనగామ జిల్లాలో జన్మించారు. బుర్రా వెంకటేశం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సర్వేల్ రెసిడెన్షియల్‌లో తన పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేశారు. గురుకులాల్లో చదివిన విద్యార్థి ఐఏఎస్‌గా మారారని సీఎం రేవంత్‌రెడ్డి పలు వేదికలపై బుర్రా వెంకటేశం గురించి ప్రస్తావించారు. పేద కుటుంబం నుంచి వచ్చిన బుర్రా వెంకటేశం ఎందరికో ఆదర్శప్రాయని ప్రశంసించారు.
ఐఏఎస్.. ఐపీఎస్.. ఐఏఎస్..
గత బీఆర్ఎస్ హయాంలో టీఎస్‌పీఎస్సీ ఉన్న కమిషన్ విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొంది. ముఖ్యంగా ఐఏఎస్ జనార్ధన్‌రెడ్డి చైర్మన్‌గా ఉన్న సమయంలో ప్రశ్నాపత్రాలు లీకు అవ్వడం.. పరీక్షలు వాయిదా పడటంతో నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత, నిరసనలు వ్యక్తమయ్యాయి. రేవంత్‌రెడ్డి సర్కార్ కొలువుదీరగానే జనార్ధన్‌రెడ్డి చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. అనంతరం కాంగ్రెస్ సర్కార్ టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన దిశగా అడగులు వేసింది. కమిషన్‌ను టీజీపీఎస్సీగా మార్చింది. మాజీ డీజీపీ, సీనియర్ ఐపీఎస్ ఎం మహేందర్‌రెడ్డిని చైర్మన్‌గా నియమించింది. ఆయన పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ఈసారి సీనియర్ ఐఏఎస్ బుర్రా వెంకటేశంను చైర్మన్‌గా నియమించింది.