- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సకాలంలో బిల్లులు చెల్లించేలా ప్రజలను చైతన్య పరచండి : కొండల్ రెడ్డి
దిశ,ఘట్కేసర్ : సకాలంలో పనులు చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి కృషి చేసేలా ప్రజలను చైతన్యవంతం చేయాలని పోచారం మున్సిపల్ సిబ్బంది, అధికారులకు చైర్మన్ కొండల్ రెడ్డి సూచించారు. మంగళవారం మున్సిపల్ కార్యలయంలో చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి అధ్యక్షతన రెవెన్యూ విభాగంతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కొండల్ రెడ్డి మాట్లాడుతూ... విలీన గ్రామాలతోపాటు అన్ని వార్డులలో ఇంటి నెంబర్ లేని ఇండ్లు, వ్యాపార సముదాయాలు ఉండవద్దని, అధికారులకు సూచించారు.
మున్సిపల్ పరిధిలోని ప్రజలందరూ ఇంటి పన్నులు కట్టి మున్సిపల్ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని మున్సిపల్ అధికారులకు సహకరించాలని కోరారు. అలాగే యనంపేట్ శ్రీనిధి కాలేజ్ మరియు రాక్ ఉడ్ పాఠశాల రీ అసెస్మెంట్ చేయాలని కోరారు. కార్యక్రమంలో చైర్మన్ కమిషనర్ వీరారెడ్డి, రెవెన్యూ అధికారులు కిరణ్, సాయి రాజ్, వార్డు ఆఫీసర్ లు, బిల్ కలెక్టర్లు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.