నాలా విస్తరణ, నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే గాంధీ..

by Sumithra |
నాలా విస్తరణ, నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే గాంధీ..
X

దిశ, శేరిలింగంపల్లి : కొండాపూర్ డివిజన్ పరిధిలోని గఫుర్ నగర్ కాలనీ జంక్షన్ నుండి దుర్గం చెరువు వరకు, అలాగే సైబర్ హిల్స్ నుండి వయా జనార్దన్ హిల్స్ యూరో కిడ్స్ స్కూల్ వరకు రూ.25 కోట్ల 41 లక్షల అంచనా వ్యయంతో చేపట్టబోయే నాలాల విస్తరణ నిర్మాణం పనులను బుధవారం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ అరెకపూడి గాంధీ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సైబర్ హిల్స్ నుండి వయా జనార్దన్ హిల్స్ యూరో కిడ్స్ స్కూల్ వరకు రూ.13.86 కోట్లతో నాలా విస్తరణ పనులు, గఫూర్ నగర్ కాలనీ జంక్షన్ నుండి దుర్గం చెరువు వరకు రూ.11.55 కోట్లతో ఆర్ సీసీ బాక్స్ నిర్మాణం చేపడతారని, మొత్తం రూ.25 కోట్ల 41 లక్షల అంచనావ్యయంతో నాలా విస్తరణ పనులు చేపడతామని తెలిపారు. పనుల్లో వేగం పెంచాలని, యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించాలని, అధికారులకు సూచించారు. పనుల పై పలు సలహాలు, సూచనలు చేశారు.

ప్రతిసారి వర్షాలకు వరద నీరు కాలనీలు ముంచెత్తడం జరుగుతుందని, ఈ సమస్య శాశ్వత పరిష్కారం దిశగా పనులు చేపడతామన్నారు. భవిష్యత్తులో వరద సమస్య మళ్ళీ పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకొని నాల విస్తరణ పనులు చేపడుతున్నామని, నాలా విస్తరణ, ఆర్సీసీ బాక్స్ డ్రైన్ నిర్మాణం వలన ప్రజలకు ఎంతగానో ఉపశమనం కలుగుతుందని అన్నారు. ఈ పనులను రాబోయే వర్షాకాలంలో పనులు పూర్తి చేయాలని అధికారులకు పీఏసీ చైర్మన్ గాంధీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎన్ డీపీ అధికారులు ఈఈ సత్యనారాయణ, డీఈ వంశీధర్, ఏఈ వెంకటేష్, నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed