అయ్యో పాపం.. ఆ అమ్మకు నీడే కరువు..

by Sumithra |
అయ్యో పాపం.. ఆ అమ్మకు నీడే కరువు..
X

దిశ, కొత్తూరు : ఆరోగ్య సమస్యలున్నాయని కనికరం లేకుండా ఓ మహిళను రోడ్డు పక్కన వదిలేసిన ఘటన మండలంలోని ఇన్ములనర్వ గ్రామ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం ఆరు రోజుల క్రితం గ్రామ పరిధిలో ఉన్న కబ్రస్తాన్ (చిన్న దర్గా) వద్ద అర్థరాత్రి సమయంలో ఒక వాహనంలో వచ్చి మహిళలను వదిలేసి పోయారని తెలిపారు. స్థానికంగా ఉండే గ్రామస్థురాలు రోజు ఆమెకు ఆహారం అందిస్తున్నది. అనారోగ్యంతో పాటు మతిస్థిమితం సరిగా లేనందువల్లే ఇలా రోడ్డు పక్కన వదిలేసి పోయారని స్థానికులు భావిస్తున్నారు.

ఎంత అడిగినా చిరునామా చెప్పడం లేదని, తన పేరు ముంతాజ్ బేగం అని మాత్రమే చెప్తుందని తెలిపారు. దగ్గరుండి చూసుకోవాల్సిన వారే ఇలా తల్లిదండ్రుల పట్ల కర్కషంగా వ్యవహరిస్తున్న తీరు కలచివేస్తోంది అని అన్నారు. మతిస్థిమితం సరిగా లేదని తెలిసి కూడా తీవ్రమైన చలిలో వదిలేసి వెళ్లిపోయారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె వద్ద ఎలాంటి ఆధారాలు లేవని ఎవరైనా స్పందించి ఆమెను వృద్ధాశ్రమంలో చేర్పించుటకు ముందుకు రావాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed