Minister Aanam: తొక్కిస‌లాటకు కారణం ఇదే.. మంత్రి ఆనం సెన్సేషనల్ కామెంట్స్

by Shiva |   ( Updated:2025-01-09 09:41:35.0  )
Minister Aanam: తొక్కిస‌లాటకు కారణం ఇదే.. మంత్రి ఆనం సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌‌డెస్క్: తిరుపతి (Tirupati) వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ కేంద్ర వద్ద జరిగిన తొక్కిసలాట (Stampede) ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Minister Aanam Ramnarayana Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారుల సమన్వయ లోపం వల్లే తొక్కిసలాట చోటుచేసుకుందని కామెంట్ చేశారు. మృతుల కుటుంబాలు, క్షతగాత్రుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇక నుంచి అధికారుల మధ్య ఉన్న సమన్వయ లోపాన్ని సరిచేస్తామని.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని తెలిపారు. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని.. అయినా, తొక్కిసలాట చోటుచేసుకోవడం తనను ఎంతగానో కలచివేసిందని మంత్రి ఆనం అన్నారు.

కాగా, తొక్కిసలాట ఘటనలో తాజా సమాచారం ప్రకారం ఇప్పటి వరకు మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పో్యారు. అందులో నర్సీపట్నానికి చెందిన బి.నాయుడు బాబు (51), విశాఖకు చెందిన రజిని (47), లావణ్య (40), శాంతి (34), కర్ణాటక (Karnataka) రాష్ట్రానికి చెందిన బళ్లారికి చెందిన నిర్మల(50), తమిళనాడు (Tamilnadu) రాష్ట్రంలోని సేలం ప్రాంతానికి చెందిన మల్లిక (49) ఉన్నారు. ఇదే ఘటనలో మరో 40 మందికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. అందులో మరో నలుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లుగా వైద్యులు రుయా ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

Advertisement

Next Story