Ap: పీఎమ్ మోడీ వచ్చేశారు.. కాసేపట్లో ఏం చేయబోతున్నారంటే..!

by srinivas |   ( Updated:2025-01-08 11:45:36.0  )
Ap: పీఎమ్ మోడీ వచ్చేశారు.. కాసేపట్లో ఏం చేయబోతున్నారంటే..!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్‌కు చేరుకున్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆయన విశాఖకు చేరుకున్నారు. విశాఖ, ఒడిశాలోనూ రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. వివిధ పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను చేయనున్నారు. ఈ మేరకు విశాఖ ఎయిర్ పోర్టు వద్ద ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, గవర్నర్ నజీర్‌తో పాటు పలువురు కూటమి మంత్రులు, నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పూలగుచ్ఛం ఇచ్చి ఆయనను రాష్ట్రానికి ఆహ్వానించారు. కాసేపట్లో విశాఖ నగరంలో ప్రధాని మోడీ రోడ్ షో జరగనుంది. ఈ కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ సైతం పాల్గొంటారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సారి రాష్ట్రానికి మోడీ వచ్చారు. రాష్ట్రంలో రెండు లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిన ప్రధాని మోడీ.. రోడ్ షో తర్వాత వాటికి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

Advertisement

Next Story

Most Viewed