- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటించాలి : హుజురాబాద్ ఏసీపీ
దిశ, హుజురాబాద్ : ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని హుజురాబాద్ లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేస్తున్నామని హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు పురస్కరించుకుని మంగళవారం హుజురాబాద్ లోని సైదాపూర్ మూల మలుపు వద్ద రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు లో భాగంగా ఆయన మాట్లాడారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటించాలని ఆయన అన్నారు.
వాహనాలు నడిపేటప్పుడు ఎంతో జాగ్రత్తగా నడపాలని, ముఖ్యంగా మత్తు పదార్థాలు, మద్యం సేవించి వాహనాలు నడపరాదని అన్నారు. నిబంధనలను పాటిస్తూ వాహనాలు నడిపితే ప్రమాదాల సంఖ్య చాలావరకు తగ్గించవచ్చని అన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు విధిగా హెల్మెట్ ధరించాలని, కారులో వెళ్లేవారు సీటు బెల్టు వేసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని, అవసరమైతే వెహికల్స్ సీజ్ చేయడంతోపాటు వారి లైసెన్స్ కూడా రద్దు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హుజరాబాద్ పట్టణ సీఐ గుర్రం తిరుమల్ గౌడ్, రూరల్ సీఐ పులి వెంకట్ గౌడ్, ఎస్సై యునెస్ అహ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు.