T.Congress: పదవుల కాదు నాకు ఆత్మాభిమానం ముఖ్యం.. MLC సంచలన ప్రకటన

by Gantepaka Srikanth |
T.Congress: పదవుల కాదు నాకు ఆత్మాభిమానం ముఖ్యం.. MLC సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌(Sanjay Kumar)ను ఉద్దేశించి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(Jeevan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నిజామాబాద్‌ జిల్లాలోని డిచ్‌పల్లిలో కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్, మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) పాల్గొన్నారు. మహేష్ కుమార్ గౌడ్ ఎదుటే జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దశాబ్దకాలంగా కాంగ్రెస్‌ నేతలను అణచివేతకు గురిచేసిన వారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు పదవులు ముఖ్యం కాదని.. ఆత్మాభిమానం ముఖ్యమని సంచలన ప్రకటన చేశారు.

అంతకుముందు జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం అప్పు చేసైనా రూ.21 వేల కోట్లతో రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేశామని జీవన్ రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే ప్రభుత్వం రైతు భరోసా అమలు చేస్తోందని బీజేపీ చేస్తున్న ఆరోపణలను ఖండించారు. ప్రతిపక్షాలు అనవసరపు విమర్శలు మానుకొని ప్రజలకు మంచి జరిగితే హర్షించాలని కోరారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా కింద ఎకరాకు రూ.12 వేల చొప్పున అందిస్తామని, రైతు కూలీలకు ఏటా రూ.12వేల సాయం అందిస్తామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed