చైనా మంజా అమ్మితే కఠిన చర్యలు

by Sridhar Babu |
చైనా మంజా అమ్మితే కఠిన చర్యలు
X

దిశ, ఆసిఫాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన చైనా మంజా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు బుధవారం హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా చైనా మంజా విక్రయాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు, చైనా మంజాతో మనుషులతో పాటు పక్షులకు ప్రమాదం పొంచి ఉందన్నారు. దాంతో తలెత్తే అనర్థాల పై అందరికీ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. నైలాన్, సింథటిక్ దారాలతో పక్షులకు, పర్యావరణానికి, మనుషులకు హాని కలుగుతుందని, జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో చైనా మంజా వినియోగాన్ని పూర్తిగా నిషేధించడం జరిగిందని పేర్కొన్నారు. దానిని అమ్మినా, అక్రమ రవాణా చేసినా స్థానిక పోలీసులకు లేదా 100 కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు.

Advertisement

Next Story

Most Viewed