PSU:‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చెయ్యాలి.. విద్యార్థి సంఘాల నిరసన

by Jakkula Mamatha |
PSU:‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చెయ్యాలి.. విద్యార్థి సంఘాల నిరసన
X

దిశ ప్రతినిధి,ధర్మవరం: తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని, 85 లక్షల తల్లులను మోసం చేసిన కూటమి ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని పి.ఎస్.యు విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మంజుల నరేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని బీఎస్ఆర్ బాలుర పాఠశాల వద్ద తల్లికి వందనం అమలు చేయాలి అని విద్యార్థులతో కలిసి పి ఎస్ యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యార్థులకు తల్లిదండ్రులకి యువగళం పాదయాత్రలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మేనిఫెస్టో లో తల్లికి వందనం ఇస్తామని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ విద్యా సంవత్సరం కాకుండా వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం అమలు చేస్తామని నిర్ణయాన్ని తప్పుపట్టారు.

కూటమి ప్రభుత్వ మాటలు నమ్మి లక్షల మంది తల్లులు పెంచుకున్న ఆశలను అడియాశలు చేశారని మండిపడ్డారు. ప్రతి విద్యార్థికి పథకాన్ని అమలు చేస్తాం అని చెప్పి, ఇప్పుడు మళ్ళీ వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తాం, అంటూ మోసం చేయడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం గురించి పునరాలోచించి ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేసి, పేద మధ్య తరగతి విద్యార్థులను ఆదుకోవాలని కోరారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 3,580 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రగతిశీల విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో పి ఎస్ యు ధర్మవరం పట్టణ అధ్యక్షులు నందకిషోర్, భరత్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed