- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బీజేపీ కార్యాలయం పై దాడి హేయమైన చర్య.. జాంబాగ్ కార్పొరేటర్..
దిశ , హైదరాబాద్ బ్యూరో : తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయం పై కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడం అత్యంత హేయమైన చర్య అని జాం బాగ్ డివిజన్ కార్పొరేటర్ రాకేష్ జైస్వాల్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆరోపణలు చేసినప్పుడు నిరసన తెలిపేందుకు అనేక మార్గాలు ఉన్నాయని, అయితే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బాధ్యత మరచి ఇతర పార్టీ కార్యాలయాల పై దాడులు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు తరాలకు ఏం సందేశమిస్తోందో చెప్పాలన్నారు. సమాజంలో దాడులు, ప్రతి దాడులు చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. గతంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని సోనియాగాంధీ కున్నుకా సౌదాగర్ అని వ్యాఖ్యలు చేసినా ప్రధాని మోడీ ఎప్పుడు కూడా సోనియాగాంధీ కుటుంబం పై ఆరోపణలు చేయలేదన్న విషయాన్ని ఆ పార్టీ నేతలు గుర్తుంచుకోవాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో దాడులు నడవవని హెచ్చరించారు. ఇప్పటికైనా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ కార్యాలయం పై దాడి చేసిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలతో బేషరతుగా క్షమాపణ చెప్పించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాకేష్ జైస్వాల్ డిమాండ్ చేశారు.