కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి.. నిర్మలా జగ్గారెడ్డి..

by Sumithra |
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి.. నిర్మలా జగ్గారెడ్డి..
X

దిశ, సంగారెడ్డి : కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి అన్నారు. బుధవారం సంగారెడ్డిలోని ఐబీలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి రైతు భరోసా రూ.12 వేలు చేయడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, క్యాబినెట్ మంత్రులు రైతు భరోసా రూ.12 చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగిస్తున్నామన్నారు.

కాంగ్రెస్ ప్రభూత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అన్నారు రైతులు. రైతు భరోసా రూ.12 వేలు చేసినందుకు సంగారెడ్డి నియోజకవర్గ రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి ఆంజనేయులు, సీడీసీ చైర్మన్ రాంరెడ్డి, సంగారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ రామచందర్ నాయక్, సదాశివపేట మార్కెట్ కమిటీ చైర్మన్ సడాకుల కుమార్, ఆత్మ కమిటీ చైర్మన్ వై.ప్రభు, మాజీ గ్రంథాలయ చైర్మన్ తో పాటు అనంత కిషన్, సదాశివపేట మండల ప్రెసిడెంట్ సిద్దన్న, కంది పార్టీ మండల ప్రెసిడెంట్ మోతి లాల్ నాయక్, సదాశివపేట పట్టణ అధ్యక్షులు సత్యనారాయణ, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కూన సంతోష్, వెంకట్, చిత్తారి యాదగిరి, కసిని రాజు, కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed