సంగారెడ్డి జిల్లా నార్కోటిక్ బ్రాంచ్ ద్వారా సత్ఫలితాలు.. డీజీ అభిలాష బిస్త్

by Sumithra |
సంగారెడ్డి జిల్లా నార్కోటిక్ బ్రాంచ్ ద్వారా సత్ఫలితాలు.. డీజీ అభిలాష బిస్త్
X

దిశ, సంగారెడ్డి : మాదకద్రవ్యాల నిర్మూలనకు ఏర్పాటు చేసిన సంగారెడ్డి జిల్లా నార్కోటిక్ బ్రాంచ్ ద్వారా సత్ఫలితాలు ఇస్తుందని డీజీ అభిలాష బిస్త్ అన్నారు. బుధవారం వార్షిక తనిఖీలలో భాగంగా సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయాన్ని తనిఖీ చేశారు. జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ స్వాగతం పలికారు. పరేడ్ గ్రౌండ్ నందు సిబ్బంది పరేడ్, టర్న్ అవుట్, మాబ్రిల్ డ్రిల్, వెపన్ డ్రిల్ తనిఖీ చేశారు. అనంతరం ఆర్ముడ్ రిజర్వ్ కార్యాలయం, ఆయుధగారాన్ని తనిఖీ చేశారు. మోటార్ వెహికల్ సెక్షన్ నందు ఇన్స్పెక్షన్ చేస్తూ 5 ఎస్ రికార్డ్ లను తనిఖీ చేశారు. ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయంలోని అడ్మిన్ విభాగంలో సెక్షన్ సిబ్బందితో మాట్లాడుతూ సిబ్బంది బిల్స్ ఎలాంటి పెండింగ్ లేకుండా చూడాలని, సిబ్బంది సర్వీస్ బుక్ ఆన్లైన్/ ఆఫ్ లైన్ మెయింటెనెన్స్ సక్రమంగా ఉండాలని అన్నారు. పోలీస్ సిబ్బందికి రావాల్సిన ఇంక్రిమెంట్స్, సరెండర్ లీవ్స్, క్రమం తప్పకుండా వచ్చే విధంగా చూడాలని అన్నారు.

అనంతరం కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ గత సంవత్సరంలో జరిగిన క్రైమ్స్, నేరాల నివృత్తికి జిల్లా పోలీసు శాఖ తీసుకున్న చర్యలు, మాదక ద్రవ్యాల నిర్మూలనకు ఏర్పాటు చేసిన S-Nab, ట్రాఫిక్ రద్దీ నివారణకు తీసుకున్న చర్యల గురించి డీజీ వివరించారు. ఆనంతరం డీజీ అభిలాష బిస్త్ మాట్లాడుతూ సిబ్బంది కొరత ఉన్నప్పటికీ జిల్లా యంత్రాంగం మంచి ఫలితాలను తీసుకురాడం జరిగిందని, జిల్లా పోలీసుల పని తీరును అభినందించారు. గత సంవత్సరం భర్తీ అయిన పోలీసు కానిస్టేబుల్స్ తో సిబ్బందితో కొరత తీరిందన్నారు. మహిళా సిబ్బంది అన్ని రకాల విధులను నిర్వహించడానికి సిద్దంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన విధులను పూర్తి నిబద్ధతతో నిర్వహించాలని సూచించారు. చట్టం ముందు అందరూ సమానులేనని, అధికారులు సిబ్బంది ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ఏ ఒక్కరూ తప్పు చేసిన మొత్తం పోలీసు శాఖకు చెడ్డ పేరు వస్తుందని అన్నారు. సిబ్బంది హెల్త్ విషయమై తగు జాగ్రత్తలు తీసుకోవాలని, రోజు వ్యాయామం చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గౌరవ మల్టీ జోన్-II ఐజి వి.సత్యనారాయణ, అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎ.సంజీవ రావ్, డీటీసీ అదనపు ఎస్పీ శ్రీనివాస్ రావ్, అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఇ.కళ్యాణి, డీఎస్పీ లు సత్యయ్య గౌడ్, రవీందర్ రెడ్డి, రాంమోహన్ రెడ్డి, వెంకట్ రెడ్డి జిల్లా ఇన్స్పెక్టర్, ఆర్.ఐలు తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed