మోడల్ స్కూల్ లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

by Naveena |
మోడల్ స్కూల్ లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
X

దిశ, నాగారం: మండలంలోని పసునూరు మోడల్ స్కూల్ లో 6వ తరగతి నుండి 10వ తరగతి ప్రవేశాలకు విద్యార్థులు నుండి దరఖాస్తులు ఈ నెల 6వ తేది నుండి ఫిబ్రవరి 28వరకు స్వీకరించబడతాయని ప్రిన్సిపాల్ తెలిపారు. దరఖాస్తులు ఆన్ లైన్ ద్వార మాత్రమే చేసుకోవాలని, 6వ తరగతి లో 100 సీట్లు, 7వ తరగతి నుండి 10 తరగతులలో ఖాళీ సీట్లు భర్తీ అవుతాయన్నారు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 13న, 6వ తరగతి వారికి ఉదయం 10:00 గంటల నుండి 12:00 గంటల వరకు, 7వ తరగతి నుండి 10వ తరగతి వారికి మధ్యాహ్నం 2:00 గంటల నుండి 4:00 గంటల వరకు స్థానిక మోడల్ స్కూల్లో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 9492362945, 9398109152, నంబర్లను సంప్రదించగలరని, ప్రిన్సిపాల్ బి.చంద్రబాబు ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

Next Story