Visakha To Maharastra: 120 స్పీడులో వచ్చి.. పోలీసులను చూసి ఎస్కేప్

by srinivas |   ( Updated:2025-01-08 11:10:17.0  )
Visakha To Maharastra: 120 స్పీడులో వచ్చి.. పోలీసులను చూసి ఎస్కేప్
X

దిశ, వెబ్ డెస్క్: గంజాయి అక్రమ తరలింపు ఏపీలో జోరుగా సాగుతోంది. పోలీసుల తనిఖీల్లో వందల కొద్ది సరకు పట్టుబడుతోంది. విశాఖ ఏజెన్సీ నుంచి వివిధ ప్రాంతాలకు తరలించి అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. పోలీసులు ఎంత నిఘా పెట్టిన యదేచ్ఛగా తరలించుకుపోతున్నారు. గంజాయిపై ఉక్కుపాదం మోపాలన్న లక్ష్యానికి తూట్లు పడుతున్నాయి.


తాజాగా కూడా భారీగా గంజాయిని పోలీసులు గుర్తించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద పోలీసులు బుధవారం వాహన సోదాలు(Vehicle Searches) చేశారు. అయితే ఈ సోదాల్లో దాదాపు 200 కేజీ గంజాయి(Ganjai)ని పట్టుకున్నారు. రూ. 25 లక్షల విలువైన సరుకును విశాఖ(Visakha) నుంచి హైదరాబాద్(Hyderabad) మీదుగా మహారాష్ట్ర తరలించేందుకు దుండగులు ప్లాన్ చేశారు. ఈ మేరకు విశాఖ ఏజెన్సీ రెండు కార్లలో గంజాయి తీసుకుని బయల్దేరారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు దాటి వచ్చారు. అయితే కృష్ణా జిల్లాలకు చేరుకుగానే పోలీసులు ప్రత్యక్షమయ్యారు. నందిగామ వద్ద కాపు కాసి అక్రమార్కులను పట్టుకునేందుకు ప్రయత్నం చేశారు. దీంతో దుండగులు కారును వదిలిసి అక్కడ నుంచి పారి పోయారు.

ఈ మేరకు రెండు కార్లను సీజ్ చేసి గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కారు నెంబర్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మత్తు పదార్థాల తరలింపు రాష్ట్రంలో నిషేధమని, నిబంధనలను అతిక్రమించొద్దని సూచించారు. గంజాయి తరలిస్తే ఎంతటి వారినైనా వదిలపెట్టమని పోలీసులు హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed