- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Jagadish Reddy : కేటీఆర్ పై తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మరు : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
దిశ, వెబ్ డెస్క్ : కేటీఆర్(KTR) అహర్నిశలు తెలంగాణ అభివృద్ధికి పాటు పడ్డారని, ఆయన మీద తప్పు ప్రచారాన్ని ప్రజలు నమ్మరని బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి(Jagadish Reddy) పేర్కొన్నారు. పార్టీ నేతలతో కలిసి హైదరాబాద్ లో ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్(Hyderabad) పేరును ప్రపంచ స్థాయిలో నిలిపేందుకు కేటీఆర్ చేసిన కృషి ప్రజలు గుర్తుంచుకుంటారని అన్నారు. కాంగ్రెస్ నేతలు ఎంత అబద్దపు ప్రచారం చేసినా వారి మాటలు ప్రజలు నమ్మరని తెలిపారు. కేటీఆర్ ను తప్పుడు కేసుల్లో ఇరికించాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారని.. కాని న్యాయస్థానం, చట్టాలపై తమకు నమ్మకం ఉందని.. సీఎం చేస్తున్న కుట్రను దాటుకొని కడిగిన ముత్యంలా కేటీఆర్ బయటకి వస్తారని తెలియ జేశారు. అక్రమ కేసులపై భయపడేది లేదని, ప్రభుత్వంపై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని అన్నారు. కాంగ్రెస్ హామీలన్నీ నెరవేర్చే వరకు వదలబోమని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.