- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అత్తెసరు సిబ్బందితో సరి..!
దిశ,చిలుకూరు: ఉద్యోగులుంటేనే పనులు జరిగేది అంతంత మాత్రం..అలాంటిది జనాభాకు సరిపోను సిబ్బంది లేకపోతే ఆ గ్రామం పరిస్థితి ప్రశ్నార్థకమే..ఈ విషయమై ఉన్నతాధికారులే ఆలోచించాలి. మండలంలోని కొండాపురం గ్రామపంచాయతీలో మొత్తం జనాభా 2447 ఉన్నారు. దాని ప్రకారం వెయ్యి మందికి ఒకరి చొప్పున ఇద్దరు ఆశా కార్యకర్తలు ఉండాలి. కాని గ్రామంలో ఒక్కరే ఉన్నారు. దీంతో స్థానికులకు ఆరోగ్య సంబంధ సలహాలు,సర్వే నిర్వహించేందుకు కష్టతరమవుతోంది. గ్రామంలో వైద్య శిబిరాలు నిర్వహించేప్పుడు పక్క గ్రామం నుంచి సిబ్బందిని రప్పించడం ఇబ్బందిగా మారింది. గ్రామంలో రెండు అంగన్వాడీ కేంద్రాలుండగా రెండింట్లో ఆయాలు లేరు. దీంతో ఆ కేంద్రాలకు చిన్న పిల్లలను తీసుకురావడం, వారి సంరక్షణ చూడడం అంగన్వాడీ టీచర్లకు తలకు మించిన భారంగా మారింది. ఇలా అయితే స్త్రీ, శిశు సంక్షేమం ఎలా సాధ్యమవుతుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి క్షేత్ర సహాయకుడే(ఫీల్డ్ అసిస్టెంట్) లేరు. ఇక్కడి ఆ సహాయకుడు మరణించి అయిదేళ్లవుతున్నా నేటికీ ఎవరినీ నియమించలేదు. దీంతో ఉపాధి పనుల కేటాయింపు, మాస్టర్ల నమోదులో అవకతవకలు జరుగుతున్నాయని, కూలీ వేతనాల మంజూరులో అక్రమాలు చోటుచేసుకున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. విచిత్రమేమిటంటే మండలంలోని కొన్ని గ్రామాల్లో అక్కడి జనాభాకు మించి వివిధ విభాగాల్లో సిబ్బంది ఉన్నారు. వారంతా అదనంగా ఉన్నట్లే. తమ గ్రామం దుస్థితి ఏంటా అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి తమ గ్రామంపై దృష్టి సారించి చాలినంత సిబ్బందిని నియమించేందుకు తగు చర్యలు తీసుకోవాలని కొండాపురం ప్రజలు కోరుతున్నారు.