దిశ ఎఫెక్ట్.. బోర్ల తవ్వకానికి భూగర్భ జల శాఖ అనుమతి తప్పనిసరి

by Naveena |
దిశ ఎఫెక్ట్.. బోర్ల తవ్వకానికి భూగర్భ జల శాఖ అనుమతి తప్పనిసరి
X

దిశ ,మర్రిగూడ: జిల్లాలో బోర్ల తోవ్వకానికి వాల్టా చట్టం ప్రకారం భూగర్భ జల శాఖ అనుమతులు తప్పనిసరిగా ఉత్తర్వులు జారీ చేసింది. మళ్లీ కలవర పెడుతున్న ఫ్లోరైడ్ భూతం" అనే శీర్షికన గత నెల 22న ప్రచూరితమైన దిశ కథనానికి అధికారులు స్పందించారు. బోర్ల తవ్వకానికి గతంలో తవ్విన బోర్లకు భూగర్భ జల శాఖ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని లేనిచో వాల్టా చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని జిల్లా భూగర్భ జల శాఖ ఉప సంచాలకులు ఉత్తర్వులు జారీ చేశారు. నల్గొండ జిల్లాలో పోయిందనుకున్నా ఫ్లోరైడ్ భూతం మళ్ళీ కేసులు నమోదు అవుతుండడంతో..జిల్లాలో ఫ్లోరైడ్ భూతానికి ప్రజలు భయకంపితులైతున్నారు. మళ్లీ కలవర పెడుతున్న ఫ్లోరైడ్ భూతం అనే పతాక శీర్షికన దిశ పత్రిక కథనం రాసింది. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి కృష్ణా జలాలు అందిస్తున్నప్పటికీ ఎక్కువమంది ఫిల్టర్ వాటర్ తాగడం ద్వారా గర్భిణీ స్త్రీలలో పాఠశాలలో అంగన్వాడి కేంద్రాల్లో చదువుతున్న విద్యార్థుల్లో ఫ్లోరైడ్ కేసులు నమోదవుతున్నాయి. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రూరల్ వాటర్ సిబ్బంది గ్రామాల్లో నీటి నమూనాలు సేకరించి పరీక్షించి నివేదిక అందజేశారు.దీంతో పారిశ్రామిక ,మైనింగ్ ,బల్క్ వాటర్ సప్లై ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో గతంలో నిర్మించిన నూతనంగా నిర్మించిన బోరుబావులకు భూగర్భ జల శాఖ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. మండలాల్లో తాసిల్దార్ కార్యాలయం నుండి అనుమతులు తీసుకోవాలని భూగర్భ జల శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆలస్యంగా నైనా భూగర్భ జల శాఖ స్పందించడంతో ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ కంచుకట్ల సుభాష్ భూగర్భ జల శాఖకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed