చెందిప్ప గ్రామాన్ని సందర్శించిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి మనవడు..

by Sumithra |
చెందిప్ప గ్రామాన్ని సందర్శించిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి మనవడు..
X

దిశ, శంకర్ పల్లి : శంకర్ పల్లి మండలం చందీప్ప గ్రామంలోని మరకత శివాలయాన్ని బుధవారం కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప మనవడు అమ్మేయ గ్రేగ్ గ్రిడ్ గ్రూప్ అధినేత నిఖిల్ చంద్ర ముళ్ళపూడి, వైటీ చౌదరి, సినీనటి కారుణ్య చౌదరి, సినీ గాయ రచయిత అనంత శ్రీరామ్ తదితరులు సందర్శించారు. బ్రహ్మ శ్రీ మరకత శివాలయాన్ని సందర్శించి వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు.

ఆలయ ప్రధాన అర్చకులు శివసాయి ప్రసాద్ ఆలయ కమిటీ నిర్వాహకులు స్వామివారి విశిష్టతను తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 11వ శతాబ్దం నాడి బ్రహ్మశ్రీ మరకత శివాలయం హైదరాబాద్ మహా నగరానికి సమీపంలో ఉండడం సంతోషకరమని, ఇలాంటి శివాలయాలు అరదుగా ఉంటాయని, వాటిని దర్శించుకోవడం మహా అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు వైస్ చైర్మన్ శేఖర్ కమిటీ సభ్యులు హనుమంతు మాజీ సర్పంచ్ శ్రీనివాస్ తదితరులు స్వామి వారి చిత్రపటాన్ని అందజేసి శాలువాతో సత్కరించారు.

Advertisement

Next Story

Most Viewed