BRS: ఆ పథకాన్ని బంద్ పెట్టేందుకు కాంగ్రెస్ కుట్ర.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |   ( Updated:2024-11-30 05:33:27.0  )
BRS: ఆ పథకాన్ని బంద్ పెట్టేందుకు కాంగ్రెస్ కుట్ర.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: సాగుకు పెట్టుబడి సాయం అందించి రైతన్నకు భరోసా కల్పించిన రైతు బంధు(Raithu Bandu) పథకాన్ని శాశ్వతంగా బంధు పెట్టే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) తెర లేపడం సిగ్గుచేటని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు(BRS Leader Harish Rao) మండిపడ్డారు. రైతు బోనస్(Raithu Bonus) పై మంత్రి తుమ్మల(Minister Thummala Nageshwar Rao) మాట్లాడిన వ్యాఖ్యలను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. రైతుబంధు కంటే సన్నాలకిచ్చే రూ. 500 బోనసే మేలు అంటూ, రైతులు చెబుతున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి చెప్పడం శోచనీయమని అన్నారు.

ప్రపంచంలో రైతుకు పెట్టుబడి సాయం అందించిన ఏకైక పథకం రైతుబంధు అని ఐక్యరాజ్య సమితి(United MNations Organization) సైతం ప్రశంసించిందని, అలాంటి గొప్ప పథకాన్ని ఒక ప్రణాళిక ప్రకారం రూపుమాపే ప్రయత్నం చేస్తుండడం దుర్మార్గమని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం రైతులకు దక్కిన బోనస్ సుమారు రూ. 26 కోట్లు మాత్రమేనని, అదే రైతుబంధు కింద ఏడాదికి రూ. 7500 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మీరు మ్యానిఫెస్టోలో చెప్పినట్లు ఎకరాకు రూ. 15,000 చెల్లిస్తే ఇది ఇంకా ఎక్కువ అవుతుందని, మరి రైతు బంధు కంటే, బోనస్ అందించడం రైతులకు మేలు ఎట్లవుతుందో వ్యవసాయ మంత్రి, రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమాధానం(Answer) చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి రాగానే రుణమాఫీ సగం మందికి చేసి, సగం మందికి మొండి చేయి చూపారని, ఆ తర్వాత అన్ని పంటలకు బోనస్ అని, చివరకు సన్నాళ్లకు మాత్రమే పరిమితం చేశారని, ఇప్పుడు రైతుబంధును శాశ్వతంగా రద్దు చేసే ప్రయత్నం మొదలుపెట్టారని ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతుబంధును బందు చేస్తారని కేసీఆర్ ముందే హెచ్చరించారని, అనుకున్నట్టే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నదని చెప్పారు. అలాగే రైతు భరోసా వస్తదని ఎదురుచూస్తున్న రైతులు, కౌలు రైతులు, ఉపాధి కూలీలు మోసపోయినట్లేనా? అని అడిగారు. రైతులను విజయవంతంగా మోసం చేసినందుకు రైతు పండుగ నిర్వహిస్తున్నావా? మేనిఫెస్టోలో చెప్పి, రైతులను నమ్మించి అధికారంలోకి వచ్చాక దగా చేసినందుకు విజయోత్సవాలా రేవంత్ రెడ్డి? అని ప్రశ్నించారు. రైతుల బతుకులు మార్చేందుకు కేసీఆర్ తీసుకొచ్చిన రైతు బంధు పథకాన్ని నిలిపివేసే కుట్రను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. అంతేగాక నేడు మహబూబ్ నగర్ లో నిర్వహించే కార్యక్రమంలో రైతు బంధు అమలుపై స్పష్టత ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న వానకాలం రైతుబంధు తో పాటు, యాసంగికి పంట పెట్టుబడి సాయం వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని హరీష్ రావు రాసుకొచ్చారు.

Advertisement

Next Story