ISKCON : బంగ్లాదేశ్‌‌ హిందువుల భద్రత కోసం రేపు ప్రపంచవ్యాప్తంగా ‘ఇస్కాన్’ ప్రార్థనలు

by Hajipasha |
ISKCON : బంగ్లాదేశ్‌‌ హిందువుల భద్రత కోసం రేపు ప్రపంచవ్యాప్తంగా ‘ఇస్కాన్’ ప్రార్థనలు
X

దిశ, నేషనల్ బ్యూరో : బంగ్లాదేశ్‌(Bangladesh)లో హిందువుల భద్రతను కోరుకుంటూ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణా కాన్షియస్‌‌నెస్ (ISKCON) సభ్యులు డిసెంబరు 1న ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. దాదాపు 150కిపైగా దేశాల్లోని పట్టణాలు, నగరాల్లో లక్షలాది మంది ఇస్కాన్ సభ్యులు ఆదివారం రోజు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొననున్నారు. బంగ్లాదేశీ హిందువులకు భద్రత కల్పించాలంటూ ఇస్కాన్ సభ్యులు నినదించనున్నారు.

బంగ్లాదేశ్‌లో హిందూ వర్గం(Bangladesh Hindus) తరఫున బలమైన వాణిని వినిపిస్తున్న మాజీ ఇస్కాన్ సభ్యుడు చిన్మయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారి‌పై దేశ ద్రోహం కేసు పెట్టారు. ఆయనను అరెస్టు చేశారు. తాజాగా చిన్మయ్ కృష్ణ దాస్ బెయిల్ పిటిషన్‌ను కూడా కోర్టు నిరాకరించింది. ఈనేపథ్యంలో ఆయనను జైలు నుంచి విడుదల చేయాలని ఇస్కాన్ సభ్యులు డిమాండ్ చేయనున్నారు. ఈమేరకు ఇస్కాన్ కోల్‌కతా అధికార ప్రతినిధి రాధారాం దాస్ ‘ఎక్స్’ వేదికగా ఒక పోస్ట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed