దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది : ఎమ్మెల్యే

by Kalyani |
దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది : ఎమ్మెల్యే
X

దిశ, ప్రతినిధి,మహబూబ్ నగర్: దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, ఉన్నత విద్యనభ్యసించి తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక బాలుర జూనియర్ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు పంపిణీ చేసి ప్రసంగించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ,పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు అండగా నిలుస్తున్నారని, ఆయన ప్రోత్సాహంతో ఈ జూనియర్ కళాశాలను రోల్ మోడల్ గా తీర్చిదిద్దుకుందామని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. చెడు స్నేహం, దురలవాట్లకు దూరంగా ఉంటూ తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని, ఇంటర్ విద్య జీవిత గమ్యాన్ని నిర్ణయిస్తుందని, ఈ రెండేళ్ళు కీలక సమయమని, డాక్టర్లు, ఇంజినీర్లుగా లక్ష్యాన్ని ఎంచుకొని నిర్దేశంతో ముందుకు సాగాలని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ భగవంతాచారి, ఒకేషనల్ కళాశాల ప్రిన్సిపాల్ గోపాలకృష్ణ, పీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు హర్షవర్థన్ రెడ్డి, అధ్యాపకులు నర్సింహారెడ్డి, ఎన్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed