వారికి నో ఛాన్స్.. మంత్రివర్గ విస్తరణపై తేల్చేసిన సీఎం రేవంత్‌రెడ్డి

by prasad |
వారికి నో ఛాన్స్.. మంత్రివర్గ విస్తరణపై తేల్చేసిన సీఎం రేవంత్‌రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో : కాంగ్రెస్ బీ-ఫామ్ మీద గెలిచినోళ్లకే మంత్రి పదవులు దక్కుతాయని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన ఇవాళ మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పీసీసీ ఛీఫ్, కేబినెట్ విస్తరణపై నిర్ణయాలు ఒకేసారి ఫైనల్ అవుతాయన్నారు. పీసీసీ చీఫ్‌ నియామకంపై సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. రాష్ట్రానికి రూ. 7 లక్షల కోట్లకు పైగా అప్పులున్నాయని, వాటి వడ్డీల్లో ఏ మాత్రం తగ్గినా ప్రతి ఏటా వెయ్యి కోట్లు ప్రభుత్వానికి ఆదా అవుతుందని చెప్పారు. కేసీఆర్ చేసిన తప్పులు తాము చేయబోమని, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పోస్టింగ్స్ రూల్స్ బ్రేక్ చేయదల్చుకోలేదన్నారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవని, సర్‌ప్లస్ పవర్ కొంటున్నామని సీఎం వెల్లడించారు. ఫ్రీ జర్నీ పథకంతో ఆర్టీసీ గట్టెక్కిందని తెలిపారు. కాగా ఓవైపు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్న తరుణంలో కాంగ్రెస్ బీ-ఫామ్‌పై గెలిచిన వారికే మంత్రి పదవులు అన్న సీఎం వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి.

క్లైమాక్స్‌కు పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ!..

తెలంగాణకు కొత్త పీసీసీ ఎంపిక అంశం దాదాపు చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది. రెండు,మూడు రోజులుగా రాష్ట్ర అగ్రనాయకులంతా ఢిల్లీలోనే ఉంటూ అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఇవాళ మరోసారి ఏఐసీసీ పెద్దలతో రాష్ట్ర నాయకత్వం సమావేశం కాబోతున్నట్లు తెలుస్తోంది. పీసీసీ పదవిని బీసీలకే ఇస్తారనే ప్రచారం రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ పదవిని దక్కించుకోబోతున్న లక్కీ లీడర్ ఎవరనేది చర్చగా మారింది. పీసీసీ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయాన్ని తీసుకున్న అధిష్టానం మిగతా సీనియర్ నేతల ఫీడ్‌బ్యాక్‌ను సైతం సేకరిస్తోంది. పీసీసీ రేసులో బీసీలతోపాటు ఎస్సీ నేతలు సైతం ఉన్నారు. అయితే పీసీసీ దక్కనివారికి ఎలాంటి పదవులు ఇవ్వాలనే దానిపై అధిష్టానం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed