పోలవరంపై చంద్రబాబు శ్రద్ధ లేదు.. మాజీ మంత్రి అంబటి స్ట్రాంగ్ కౌంటర్

by srinivas |
పోలవరంపై చంద్రబాబు శ్రద్ధ లేదు.. మాజీ మంత్రి అంబటి స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, వెబ్ డెస్క్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై సీఎం చంద్రబాబునాయుడు శ్వేత పత్రాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. జగన్ ప్రభుత్వం పోలవరాన్ని నాశనం చేసిందని ఆయన ఆరోపించారు. దీంతో మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. పోలవరంపై చంద్రబాబు శ్రద్ధ లేదు.. మాజీ మంత్రి అంబటి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కరోనా సమయంలోనూ పనులు ఆగలేదని తెలిపారు. చిన్న తప్పుకూడా లేకుండా ప్రాజెక్టు పనులు జరిగాయని తెలిపారు. మళ్లీ జగన్ పుంజుకుంటారనే భయం చంద్రబాబులో కనిపిస్తోందన్నారు. సీఎం అయిన తర్వాత చంద్రబాబుకు అహం పెరిగిందని మండిపడ్డారు. పదే పదే జగన్ ను దూషిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు అంత తేలికగా అర్ధం కాదు కాబట్టే చాలా స్టడీ చేసి నిర్ణయానికి వచ్చామన్నారు. చంద్రబాబు చేసిన తప్పు వల్లే పోలవరం ప్రాజెక్టు నాశనమైందన్నారు. ప్రోటోకాల్ పాటించకపోవడం వల్లే పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి కారణమని మాజీ మంత్రి అంబటి చెప్పారు.

Next Story

Most Viewed