ALERT : హైదరాబాద్‌లో కాసేపట్లో మళ్లీ భారీ వర్షం..

by Rajesh |   ( Updated:2024-05-16 14:17:44.0  )
ALERT : హైదరాబాద్‌లో కాసేపట్లో మళ్లీ భారీ వర్షం..
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలో కాసేపటి క్రితం జోరు వాన పడగా.. ఇప్పటికే పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే సాయంత్రం 6 తర్వాత మళ్లీ భారీ వర్షం పడే చాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రాత్రి పలు చోట్ల వడగళ్ల వాన పడుతుందని తెలిపింది. అయితే హైదరాబాద్‌తో పాటు ఆయా జిల్లాల్లో 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొన్న విషయం తెలిసిందే. ఒక్కసారిగా కుండపోతగా కురిసిన వర్షంపై సీఎం రేవంత్ రెడ్డి సెక్రటేరియట్‌లో సమీక్ష నిర్వహించారు. వెంటనే అధికారులు ప్రజలు ఇబ్బంది పడకుండా సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.

Read More...

Two people died due to lightning: పిడుగుపాటుకు ఇద్దరు వ్యక్తులు మృతి..

Advertisement

Next Story

Most Viewed