- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఉన్నదే ఇద్దరు పంతుళ్లు...అయినా సక్రమంగా రారు
దిశ,భైంసా : ఆ పాఠశాలలో ఉన్నదే ఇద్దరు పంతుళ్లు...అయినా వారు కూడా సక్రమంగా రావడం లేదు. దాంతో స్కూలుకు తాళం వేసి ఉండటంతో విద్యార్థులు వచ్చి తిరిగి ఇందిదారి పట్టారు. ఈ ఘటన గురువారం బైంసా మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే... బైంసా మండలం ఖత్ గాం గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఆరుగురు విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. ఓ ఉపాధ్యాయురాలు ఆరోగ్య సమస్యలతో ప్రధాన ఉపాధ్యాయులకు చెప్పి సెలవులో ఉండగా, ప్రధానోపాధ్యాయుడు మాత్రం పై అధికారులకు సమాచారం ఇవ్వకుండానే సెలవు తీసుకున్నాడు.
దీంతో పాఠశాల తెరిచే ఉపాధ్యాయులు లేక అక్కడికొచ్చిన విద్యార్థులు కొద్ది సేపు పక్కన ఉన్న అంగన్వాడీలో ఉండి ఇంటి ముఖం పట్టారు. పాఠశాలకు తాళం వేసి ఉండడం గమనించిన తాజా మాజీ సర్పంచ్ ఎంఈఓ సుభాష్ కి ఫోన్ చేయగా కాంప్లెక్స్ పరిధి హెచ్ఎం కి కాల్ చేయాలంటూ సూచించారు. కాంప్లెక్స్ పరిధి హెచ్ఎం కి కాల్ చేసి ఉపాధ్యాయుని గై హాజర్ పై వివరాలు కోరగా తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదంటూ పేర్కొన్నారు. దాంతో ఉపాధ్యాయులు రాలేదంటూ స్థానికులు చెప్పే వరకు అధికారులకు తెలియకపోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం : ఎంఈఓ సుభాష్
ఎలాంటి సమాచారం లేకుండా పాఠశాలకు గైహాజరైన ప్రధానోపాధ్యాయుడిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని, ముందస్తు సమాచారం ఇస్తే ప్రత్యేక ఉపాధ్యాయుని నియమించే వాళ్లమని ఎంఈఓ సుభాష్ పేర్కొన్నారు.
- Tags
- School lock