SP DV Srinivas Rao : సమర్ధవంతంగా విధులు నిర్వహించాలి

by Aamani |
SP DV Srinivas Rao : సమర్ధవంతంగా విధులు నిర్వహించాలి
X

దిశ, ఆసిఫాబాద్ : సమర్ధవంతంగా విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు (SP DV Srinivas Rao ) పోలిసులను ఆదేశించారు. బుధవారం రెబ్బెన పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేశారు. స్టేషన్ లోని రికార్డులను పరిశీలించి, పెండింగ్ కేసుల వివరాలను ఎస్ఐ చంద్రశేఖర్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు పోలీస్ స్టేషన్ ల్లో రికార్డులను సక్రమంగా నమోదు చేస్తూ.. స్టేషన్ లో పెండింగ్ కేసులు లేకుండా చూడాలని, మత్తు పదార్థాలు, పశువుల అక్రమ రవాణా, పేకాట రాయుళ్ళపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. అలాగే నాన్ బెయిలబుల్ వారెంట్ తిరుగుతున్న నేరస్తులతో పాటు బైండోవర్, రౌడీ షీటర్ లపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. రాత్రుల్లో పెట్రోలింగ్ పెంచి నిఘా వ్యవస్థను పటిష్టపర్చాలని ఆదేశించారు. ఎస్పీ వెంట డీఎస్పీ కరుణాకర్, సీఐ బుద్దె స్వామి తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story