Former Minister Srinivas Goud : ప్రశ్నిస్తూ పోస్టు పెడితే పోలీసులు చితకబాదారు

by Naveena |   ( Updated:2024-10-30 12:07:42.0  )
Former Minister Srinivas Goud : ప్రశ్నిస్తూ పోస్టు పెడితే పోలీసులు చితకబాదారు
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ప్రశ్నిస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడని బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ వర్ధ భాస్కర్ ను పోలీసులు అరెస్టు చేసి చితకబాది సంఘటన బుధవారం ఉదయం మహబూబ్ నగర్ పట్టణంలో చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం హామీలు నెరవేర్చడం లేదని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జీ వర్థ భాస్కర్ ను స్థానిక 1 టౌన్ పోలీసులు వీరణ్ణపేటలోని ఆయన నివాసానికి ఉదయం 5 గంటలకు వెళ్లి.. అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారని,సీఐ అప్పయ్య తనను బండబూతులు తిడుతూ,టైర్ బెల్టుతో తనను చితక బాదాడని భాస్కర్ ఆరోపించారు. విషయం తెలుసుకున్న మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్(Former Minister Srinivas Goud,)బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR )దృష్టికి తీసుకెళ్ళగా..1టౌన్ సిఐ అప్పయ్య క్షమాపణలు చెప్పాలని లేదంటే హెచ్ఆర్సీ ని ఆశ్రయిస్తామననన్నారు. న్యాయం కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. మధ్యహ్నం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ కార్యకర్తలతో వీరణ్ణపేట నుంచి ర్యాలీగా 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళి సిఐ అప్పయ్య క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ బైఠాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరినీ వ్యతిగత దూషణలు చేయలేదని,ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రశ్నిస్తే అక్రమంగా అరెస్టు చేసి కొడతారా? ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రశ్నించే హక్కు లేదా అని నిలదీశారు.వెంటనే సిఐ వర్ధ భాస్కర్ కు క్షమాపణలు చెప్పాలని మాజీమంత్రి డిమాండ్ చేశారు. సీఐ క్షమాపణలు చెప్పాలి,లేదంటే హెచ్ఆర్సీ ని ఆశ్రయిస్తామని, జరిగిన సంఘటనలను మాజీమంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్ళగా..కేటీఆర్ మాట్లాడుతూ అక్రమంగా అరెస్టులు చేసి.. కేసులు పెట్టి హింసిస్తే సహించేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్, వర్ల భాస్కర్ తో మాట్లాడారు. పోరాటాలు ఆపొద్దు..రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పోలీసుల సంగతి తెలుద్దామని ధైర్యం చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed