- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతులకు బోనస్ ఇస్తే ప్రతి పక్షాలకు మింగుడు పడటం లేదు : మంత్రి సీతక్క
దిశ, ములుగు ప్రతినిధి: ఇచ్చిన హామీలన్నిటిని అమలు చేసి తీరుతామని, మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక పథకాలను ప్రవేశపెడుతున్నారని, రైతులకు బోనస్ ఇస్తే ప్రతిపక్షాలకు మింగుడు పడటం లేదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం ములుగు జిల్లా కేంద్రంలో సహకార సంఘం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. అనంతరం ఇంచర్ల గ్రామ శివారులోని జాతీయ రహదారి నుండి సిఆర్పిఎఫ్ బెటాలియన్ వరకు రూ.35 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు, రూ. 50 లక్షలతో అంతర్గత సీసీ రోడ్లు, ఇంచర్ల గ్రామంలో రూ. 20 లక్షలతో నిర్మించ తలపెట్టిన గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షపాతిమని, రైతు బాగుంటేనే ఈ రాష్ట్రం దేశం భాగుంటుందని అన్నారు. రైతులకు సన్న ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తూ బోనస్ రూ. 500 చెల్లించడం జరుగుతుందని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలను ఒక్కటిగా నెరవేరుస్తున్నమని తెలిపారు. ప్రజా పాలన అందిస్తున్న మా ప్రభుత్వం పై ప్రతిపక్షాలు విషం కక్కుతూ విమర్శలు చేయడం సబబు కాదని, మిగులు బడ్జెట్ ఉన్న మన రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన బిఆర్ఎస్ పార్టీ కి ప్రజలు బుద్ధి చెప్పిన వాళ్ళు బుద్ధి మారడం లేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రైతులు బిఆర్ఎస్ నాయకులను నమ్మద్దని అన్నారు. అనంతరం ఉపాధి హామీ పథకం లో భాగంగా వంద రోజులు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు, గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ శుభ్రంగా ఉంచిన గ్రామ పంచాయతీ సిబ్బందిని మంత్రి సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోథ్ రవి చందర్, సహకార సంఘం చైర్మన్ బొక్క సత్తి రెడ్డి, వైస్ చైర్మన్ మర్రి రాజు తో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.